Monday, December 23, 2024

మీనాక్షి ఎనర్జీ కొనుగోలుకు వేదాంతకు ఎన్‌సిఎల్‌టి గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన వ్యాపార సామ్రాజ్యానికి మరో పెద్ద కంపెనీని జోడించడానికి సిద్ధమయ్యారు. బిలియనీర్ అనిల్ అగర్వాల్ వేదాంత త్వరలో దివాలా ప్రక్రియలో ఉన్న మీనాక్షి ఎనర్జీ కంపెనీని కొనుగోలు చేయనుంది. దీనికి ఎన్‌సిఎల్‌టి నుంచి వేదాంతకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నివేదిక ప్రకారం, మీనాక్షి ఎనర్జీ కోసం వేదాంత బిడ్‌ను ఎన్‌సిఎల్‌టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) హైదరాబాద్ బెంచ్ ఆమోదించింది. మీనాక్షి ఎనర్జీ కోసం వేదాంత రూ.1,440 కోట్ల బిడ్‌ను దాఖలు చేసింది. మీనాక్షి ఎనర్జీ వివిధ రుణదాతల నుండి రూ.4,625 కోట్ల బకాయి క్లెయిమ్‌లను అందుకుంది.

వేదాంత బిడ్ ఆమోదిస్తే రుణదాతలు మొత్తం బకాయిల్లో 31 శాతానికి సమానంగా రికవరీ పొందుతారు. మీనాక్షి ఎనర్జీ కోసం ఎన్‌సిఎల్‌టి వేదాంతతో పాటు అనేక ఇతర బిడ్‌లు కూడా వచ్చాయి. జిందాల్ పవర్, ప్రుడెంట్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, వైజాగ్ మినరల్స్ కన్సార్టియం కూడా దివాలా ప్రక్రియ ద్వారా కంపెనీ కోసం బిడ్ చేసింది. మీనాక్షి ఎనర్జీ ఒక విద్యుత్ ఉత్పత్తి సంస్థ, కంపెనీ పవర్ జనరేటింగ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్ట్ ఆఫ్ అదానీకి సమీపంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News