Thursday, January 23, 2025

తెలంగాణ ప్రభుత్వానికి పరిహారం ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి పరిహారం ఇవ్వండి
ఎమ్మార్‌కు వాటాల బదిలీ కేసులో ఎన్‌సిఎల్‌టి హైదరాబాద్ ఆదేశాలు
మన తెలంగాణ/ హైదరాబాద్: ఎమ్మార్ ఎంజిఎఫ్ ల్యాండ్ లిమిటెడ్‌కు వాటాల బదిలీ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి పరిహారం ఇవ్వాలని ఎమ్మార్ గ్రూప్‌ను ఎన్‌సిఎల్ టి హైదరాబాద్ ఆదేశించింది. ఎమ్మార్ హిల్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యతిరే కంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దాఖ లు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ భాస్కర పంతుల మోహన్, డాక్టర్ బినోద్ కుమార్ సిన్హాతో కూడిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) హైదరాబాద్ బెంచ్ తీర్పును వెలువరించింది. ఎమ్మార్ హిల్ టౌన్‌షిప్ ఆస్తులను ఎమ్మార్ ప్రాపర్టీస్(దుబాయ్), ఎమ్మార్ హోల్డింగ్స్ (మారిషస్) డీల్ చేయకూడదని కూడా బెంచ్ ఆదేశించింది. జరిగిన నష్టానికి గాను తెలంగాణ ప్రభు త్వానికి పరిహారం కూడా ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ నెల 25న ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది. టిఎస్ ఐఐసి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కంపెనీ, రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. టిఎస్‌ఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపి ఐఐసి) అనుబంధ సంస్థగా ఏర్పాటు చేశారు. 2014లో ఎపి విభజన జరిగింది. ఆ సమయంలో ఎపిఐఐసి కార్యకలాపాలను నిర్వ హిం చేందుకు టిఎస్‌ఐఐసిను ఏర్పాటు చేశారు.

NCLT Hyderabad orders EMAAR to Compensate TS Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News