- Advertisement -
ముంబయి: కొవిడ్19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఎన్‌సిపి తరఫున రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. శుక్రవారం మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌థాక్రే అధికారం నివాసం వర్షకు వెళ్లిన ఎన్‌సిపి నేతలు రూ.2 కోట్ల చెక్‌ను ఆయనకు అందించారు. ఉద్ధవ్‌ను కలిసినవారిలో ఆయన మంత్రివర్గంలోని మంత్రులు అజిత్‌పవార్, జయంత్‌పాటిల్, ఎన్‌సిపి ఎంపి సుప్రియాసూలే ఉన్నారు. తాము అందించిన రూ.2 కోట్లలో రూ. ఒక కోటి పార్టీకి సంబంధించిన రాష్ట్రవాదీ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి, మరో రూ. కోటి ఎన్‌సిపి ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల(నెల జీతాల) నుంచి సేకరించామని వారు తెలిపారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్‌సిపి ఒక భాగస్వామ్య పక్షం అన్నది తెలిసిందే. దేశంలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉన్నది.
- Advertisement -