ముంబై: మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) సోమవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన సమర్పించింది.
అధికార కూటమిలో అజిత్ పవార్ చేరిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా జితేంద్ర అవ్హాద్‌ను ఎన్‌సిపి నియమించింది. అజిత్ పవార్‌తోపాటు మరో 8 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలను అర్హులుగా ప్రకటించాలని కోరుతూ జితేంద్ర ఆదివారం రాత్రి స్పీకర్ నివాసంలో లేఖ అందచేసినట్లు వర్గాలు తెలిపాయి. ఎన్‌సిపి నుంచి తమకు పిటిషన అందినట్లు స్పీకర్ నార్వేకర్ కార్యాలయం ధ్రువీకరించింది. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్‌సిపి క్రమశిక్షణా సంఘం కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం ప్రతిని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జైప్రకాశ్ దండేగావ్‌కర్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఆదివారం సాయంత్రం అందచేశారు.
అజిత్ పవార్‌తోపాటు మరో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తమ పార్టీ పిటిషన్‌ను స్పీకర్‌కు సమర్పించినట్లు మహారాష్ట్ర ఎన్‌సిపి అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ వెంటే ఉన్నారని తెలియచేస్తూ ఎన్నికల కమిషన్‌కు ఇమెయిల్ ద్వారా లేఖ పంపినట్లు కూడా ఆయన తెలిపారు.