Sunday, December 22, 2024

డబుల్ ఇంజిన్ త్రిబుల్ ఇంజిన్‌గా మారింది: షిండే

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్ చేరికను స్వాగతిస్తున్నామని సిఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడారు. అజిత్ చేరికతో మహారాష్ట్ర మరింత బలోపేతం అవుతుందని షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం డబుల్ ఇంజిన్ ఉన్న సర్కార్ అజిత్ చేరికతో త్రిబుల్ ఇంజిన్ సర్కార్‌గా మారిందని షిండే పేర్కొన్నారు. శిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరింది. ఎన్‌సిపి నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తన వర్గం ఎంఎల్‌ఎలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు. ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే, ధనంజయ ముండే, అదితి తత్కరే పాటిల్ మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

Also Read: బిఆర్‌ఎస్‌పై డిజిపికి రేవంత్‌రెడ్డి ఫోన్‌

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News