Wednesday, January 22, 2025

ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడంలో 3 రోజుల జాప్యాన్ని వివరించండి: నగర పోలీసులకు ఎన్‌సిపిసిఆర్

- Advertisement -
- Advertisement -

NCPCR

న్యూఢిల్లీ: నగరంలో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యంపై బాలల హక్కుల సంఘం ఎన్‌సిపిసిఆర్ హైదరాబాద్ పోలీసులను వివరణ కోరింది. మైనర్‌లకు ప్రవేశాన్ని అనుమతించినందుకు సిటీ పబ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది.మే 28న ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు బాలిక పబ్‌లో పగటిపూట పార్టీకి హాజరైంది.

“సంఘటన 28.05.2022 (శనివారం) జరిగినట్లు ఆరోపించబడిన/నివేదించబడినప్పటి నుండి, పేర్కొన్న సంఘటనలో ఎఫ్‌ఐఆర్ 31.05.2022 న, అంటే సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నమోదు చేయబడిందని కమిషన్ గమనించింది. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం ఆందోళన కలిగిస్తోంది. దానికి గల కారణాలను తెలపాలి,  సంబంధిత తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలి, ఆ విషయాన్కని కమిషన్‌కు వివరించాలి” అని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్ఢ్ రైట్స్(ఎన్‌సిపిసిఆర్) శుక్రవారం హైదరాబాద్ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది.విచారణ సమయంలో బాధితురాలి గుర్తింపును(ఐడెంటిని) వెల్లడించకుండా చూడాలని కూడా కమిషన్ పోలీసులను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News