Monday, December 23, 2024

నితీశ్, మోడీ సారథ్యంలో బీహార్‌లో ఎన్‌డిఎ పోటీ

- Advertisement -
- Advertisement -

ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి విస్పష్ట ప్రకటన
న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్‌డిఎ వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సామ్రాట్ చౌదరి ఆదివారం విస్పష్టంగా ప్రకటించారు. ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ చౌదరి ‘గందరగోళం ఏమీ లేదు’ అని చెప్పారు. ఎన్నికల్లో నితీశ్‌ను తమ నేతగా ప్రచారం చేయడంపై ఎన్‌డిఎ పునరాలోచించవచ్చునంటూ సాగుతున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించవలసిందని మీడియా అడిగినప్పుడు ఆయన ఆ స్పష్టీకరణ ఇచ్చారు. ఇటీవల ఒక వార్తా చానెల్‌తో ఇంటర్వూలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు చౌదరి ఆ విధంగా స్పందించారు.

మహారాష్ట్రలో ఇటీవల విజయవంతంగా వ్యవహరించిన రీతిలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బీహార్‌లో ఎన్నికలకు ఎన్‌డిఎ వెళుతుందా అని అమిత్ షాను అడిగారు. బిజెపి మాజీ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన వ్యూహకర్తగా ఇప్పటికీ పరిగణిస్తున్న అమిత్ షా కొద్ది విరామం అనంతరం సమాధానం ఇస్తూ, ‘మేము కలసి కూర్చొని నిర్ణయిస్తాం. మేము నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు తెలియజేస్తాం’ అని చెప్పారు. 2025 ఎన్నికల్లో నితీశ్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించరాదని బిజెపి పట్టుబట్టవచ్చుననే ఊహాగానాలకు ఆ సమాధానం తావు ఇచ్చింది.

చౌదరి ఆ ఊహాగానాలను తోసిరాజంటూ, ‘ఎన్‌డిఎ బీహార్‌లో నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పని చేస్తోంది. ఆ ఇద్దరు నేతల నాయకత్వంలో మేము ఎన్నికల్లో పోటీని కొనసాగిస్తాం’ అని తెలియజేశారు. ‘2020లో మేము (నితీశ్‌ను ఎన్‌ఎడి సిఎం అభ్యర్థిగా ప్రకటించిన తరువాత పోటీ చేశాం. ఇప్పటి వరకు మేము ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్‌నే పరిగణిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మేము నితీశ్ కుమార్, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తాం’ అని బీహార్ ఉప ముఖ్యమంత్రి చౌదరి స్పష్టం చేశారు. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ శాసనసభకు 2025 ద్వితీయార్ధంలో ఎన్నికలు జరగవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News