Sunday, January 19, 2025

ఎన్‌డిఎ హ్యాట్రిక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా బిజె పి అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయగల మెజారిటీని సాధించలేకపోవడంతో ప్రభుత్వ ఏ ర్పాటుకు ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక త ప్పని పరిస్థితి నెలకొంది. కాగా..ప్రతిపక్ష ఇండియా కూట మి కూడా బలమైన శక్తిగా ఆవిర్భవించడంతో ప్రభుత్వ ఏర్పాటు పై కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశం కనపడుతోంది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై గంటలు గడుస్తున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ చూపించిన అంచనాలకు వాస్తవ పరిస్థితికి మధ్య పొంతన కనపడడం లేదు. ఏక పార్టీ పాలన ముగిసి మళ్లీ సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభమైనట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. 543 సభ్యులతో కూడిన లోక్‌సభలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది

సభ్యుల బలం అవసరం కాగా బిజెపి 240 స్థానాలకే పరిమితం కాగా ఎన్‌డిఎ కూటమి బలం దాదాపు 300 ఉండడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం సంపాదించుకుంది. మరోపక్కన చూస్తే ప్రతిపక్ష ఇండి యా కూటమి బలం 232 ఉండగా కాంగ్రెస్ పార్టీ సొం తంగా 99 స్థానాలను సొంతం చేసుకుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ బలం రెట్టింపు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పక్షంలో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును చేరుకోగలగుతారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బిజెపి బలం తగ్గడం అక్కడ ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ పెరగడం, రాజస్థాన్, హర్యానాలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బిజెపి అంచనాలకు గండిపడింది. ప్రభు త్వ ఏర్పాటుపై అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన నేతలు ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నారు.

కూటముల మధ్య పోటీ లేదు
రెండు కూటముల మధ్య పోటాపోటీ ఏమీ లేదని, భారీ మెజారిటీతో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చె ప్పారు. దేశ ప్రజలు మోడీ వెంటే ఉన్నారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే కాగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలను సంధి స్తూ తనను తాను అసాధరణ వ్యక్తిగా చిత్రీకరించుకునే మోడీ గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైందని, నైతిక బా ధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని కోరారు. ఇ దే ఈ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశమని ఆయన వ్యా ఖ్యానించారు. కాగా..80 పార్లమెంట్ సీట్లతో రాజకీయంగా అత్యం కీలక రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ దేశ ప్రజలు ఆశ్చర్యపోయేలా తీర్పు ఇచ్చింది. గత ఎన్నికల్లో 62 స్థానాలను ఒంటిచేత్తో గెలుచుకున్న బిజెపి ప్రస్తుత ఎన్నికల్లో కేవలం 36 సీట్లకే పరిమితం కాగా బిజెపి వ్యతిరేక ఓట్లను సమీకరించుకున్న ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ 34 సీట్లను గెలుచకుని తన బలాన్ని అపరిమితంగా పెంచుకుంది.

గత ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 5 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ 6 స్థానాలలో విజయం సాధించింది. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ 1.5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించినప్పటికీ బిజెపికి చెందిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాత్రం అమేథీలో గాంధీ కుటుంబ విధేయుడు, కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ శర్మ చేతిలో 1.32 లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్‌లో తన పార్టీకి అనుకూలంగా హిందూత్వ శక్తులను ఏకీకృతం చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ, కన్నౌజ్‌లో అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీతో వి జయపతాకం ఎగురవేశారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత ఎన్నికల కన్నా ఏడు స్థానాలు అధికంగా 29 స్థానాలు గెలుచుకుని తన సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు రాష్ట్రంలో తిరుగులేదని నిరూపించారు. కాగా గత ఎన్నికలలో 18 సీట్లు గెలుచుకున్న బిజెపి ప్రస్తుత ఎన్నికల్లో 12 స్థానాలతో సరిపెట్టుకోక తప్పని పిరిస్థితి ఏర్పడింది. ఇక మధ్యప్రదేశ్‌లో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది.

మొత్తం 29 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. గుజరాత్‌లో సైతం 26 స్థానాలలో 25 సీట్లను బిజెపి గెలుచుకోగలిగింది. అయితే ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బీహార్‌లో బిజెపి 12 స్థానాలు గెలుచుకోగా దాని మిత్రపక్షం నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు 13 స్థానాలు సొంతం చేసుకుంది. ఆర్‌జెడి 4 స్థానాలలో విజయపతాకం ఎగురవేసింది. రాజస్థాన్‌లో బిజెపికి 14 స్థానాలు, కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కాయి. గత ఎన్నికలలో మొత్తం అన్ని స్థానాలను బిజెపి గెలుచుకుంది. హర్యానాలో బిజెపి ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో పదికి పది స్థానాలను గెలుచుకున్న బిజెపి ఇప్పుడు కేవలం ఐదుకే పరిమితం కాగా మిగిలిన ఐదు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లు ఉండగా గత ఎన్నికలలో 23 సీట్లు గెలుచుకున్న బిజెపి ఇప్పుడు 11 సీట్లకే పరిమితం కాగా దాని మిత్రపక్షమైన శివసేన 7 స్థానాలు దక్కించుకుంది. మరోవైపు కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకోగా శివసేన(యుబిటి) 19, ఎన్‌సిపి(శరద్ పవార్) 7 సీట్లు గెలుచుకున్నాయి. ఒడిశాలో బిజెపి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. 19 లోక్‌సభ సీట్లలో బిజెపి విజయం సాధించగా బిజూ జనతా దళ్ ఒక స్థానానికే పరిమితమైంది.

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ పాలనకు చరమగీతం పాడిన బిజెపి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే బలాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు గెలుచుకోగా బిజెపి నాలుగు, జనసేన రెండు స్థానాలను గెలుచుకున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి కేవలం నాలుగు సీట్లకే పరిమితమైంది. కర్నాటకలో కాంగ్రెస్ బలం పెరిగింది. గత ఎన్నికలలో ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ప్రస్తుతం 9 స్థానాలు గెలుచుకోగా గతంలో 25 స్థానాలు గెలుచుకున్న బిజెపి ప్రస్తుతం 17కే పరిమితమైంది. కేరళలో బిజెపికి బోణీ కొట్టే అవకాశం లభించింది. త్రిసూర్‌లో సినీనటుడు సురేష్ గోపి గెలుపొందారు. గత ఎన్నికలలో 15 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్ ప్రస్తుతం 14 స్థానాలు దక్కించుకోగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ కూడా గెలుపొందారు. తమిళనాడులో అధికార డిఎంకె 22 సీట్లు, దాని మిత్రపక్షం కాగ్రెస్ 9 సీట్లు గెలుచుకుని గతం కన్నా తమ బలాన్ని పెంచుకున్నాయి. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News