Monday, January 20, 2025

చంద్రబాబు చేరికతో ఎన్డీయేకు మరింత బలం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

చిలకలూరిపేట: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రబాబు, పవన్‌ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. జూన్‌ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని ప్రధాని మోడీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News