Monday, December 23, 2024

ఎన్‌డిఎ ‘నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్’

- Advertisement -
- Advertisement -

కంచి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి అభిభాషణ
వారణాసి (యుపి) : భగవంతుడు నరేంద్ర మోడీని ఆశీర్వదించాడని, ఆయన ప్రభుత్వం ‘ఎన్‌డిఎ’, అంటే ‘నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్’ అని కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వామి శంకర విజయేంద్ర సరస్వతి ఆదివారం అభిభాషించారు. వారణాసిలో ఆర్‌జె శంకర నేత్ర వైద్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఒక కార్యక్రమంలో శంకరాచార్య ప్రసంగిస్తూ, ‘భగవంతుడు నరేంద్ర దామోదర్‌దాస్ మోడీని ఆశీర్వదించాడు.

ఆయన ప్రభుత్వం ‘నరేంద్ర దామోదర్‌దాస్ కా అనుశాసన్’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఆదర్శవంతమైన ప్రభుత్వం వలె ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం చక్కగా కృషి చేస్తోందని ఆయన శ్లాఘించారు. నేత్ర వైద్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఆయన సభలో పాల్గొన్నారు. శంకరాచార్య సంస్కృతంలో తన ప్రసంగం ప్రారంభిస్తూ, ‘ఈరోజు నేత్ర ఉత్సవ్ చూసేందుకు ఒక సదవకాశం. ఇది ముఖ్యమైన సేవ సందర్భం. ఇది కోయంబత్తూరులో మొదలైంది. ఇప్పుడు 17వ ఆసుపత్రరి మొదలవుతోంది. యుపిలో రెండు ఆసుపత్రులు కాన్పూర్‌లో, వారణాసిలో ఉన్నాయి’ అని చెప్పారు. కాశ్మీర్‌లో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలను కూడా శంకరాచార్య కొనియాడారు. తనకు మోడీతో సుదీర్ఘ అనుబంధం ఉందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News