Sunday, December 22, 2024

మోదీ నివాసంలో ఎన్డీఎ సమావేశం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఎ కూటమి సమావేశమైంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో 293 సీట్లు సాధించిన ఎన్డీఎ కూటమి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బుధవారం మోడీ నివాసంలో ఎన్డీఎ నేతలు సమావేశం అయ్యారు.

కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నితీష్ కుమార్ వంటి నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం కూటమి నేతలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ఇక, జూన్ 8న మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News