Wednesday, January 22, 2025

22న వయనాడ్‌లో భారీ కార్యక్రమానికి ఎన్‌డిఎ ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

వయనాడ్: అయోధ్యలో నిర్వహిస్తున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ నెల 22నఅయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని జిల్లాలోని పొన్కుళి శ్రీరామాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో పాటుగా పలువురు ఎన్‌డిఎ నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపారు. రాష్ట్ర ఎన్‌డిఎ కన్వీనర్ తుషార్ వెల్లపల్లి కూడా జవదేకర్‌తో పాటుగా ఈ కార్యక్రంలో పాలు పంచుకుంటారని ఆ వర్గాలు తెలిపారు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్ గాంధీపై ఎన్‌డిఎ అభ్యర్థిగా తుషార్ వెల్లపల్లి పోటీ చే శారు. కేరళలో బిజెపి అనుబంధ సంస్థ అయిన భారత్ ధర్మ జనసేన నాయకుడుగా కూడా ఆయన ఉన్నారు. ముత్తంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్కుళి నది ఒడ్డున ఉండే ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, దాని అధినాయకత్వానికి ఒక సందేశం ఇవ్వడం కోసమే రాహుల్ గాంధీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News