మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలో మూ డోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. గ తంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి కీ బిజెపికి సంపూర్ణమైన మెజార్టీ ఉండటంతో మిత్రపక్షాలకు పెద్దగా ప్రాధాన్యత లభించేది కా దు. ఈ కారణంగా గత ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క కిషన్‌రెడ్డి మాత్ర మే కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎపి నుంచి ఎవరూ లేరు. ఐ దేళ్ల పాటు కేంద్ర మంత్రి లేని రాష్ట్రంగా ఎపి ఉం ది. కేంద్రంలో ఈ సారి టిడిపి కీలక పాత్ర పో షించబోతోంది. కింగ్ మేకర్ తరహాలో ప్రభు త్వం నిలబడటానికి టిడిపి మద్దతు కీలకం కా వడంతో చంద్రబాబునాయుడు టిడిపి కోసం కీలకమైన పదవుల్ని అడిగుతున్నారని ఢిల్లీ వ ర్గాలు చెబుతున్నప్పటికీ, లోక్ సభ స్పీకర్ పదవితో పాటు మూడు కేంద్రమంత్రి పదవుల్ని చంద్ర బాబు అడుగుతున్నట్లుగా హస్తిన మీడియా వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్రమంత్రి పదవులు వస్తే టిడిపి నుంచి రామ్మోహన్ నాయుడు,
పెమ్మసాని చంద్రశేఖర్ వంటి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లావు కృష్ణదేవరాయులు సైతం కేంద్ర మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. ఇక జనసేన పార్టీ తరపున ఇద్దరు ఎంపిలు గెలుపొందారు. వారిలో ఒకరికి చాన్స్ వస్తే సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపి బాలశౌరికి అవకాశం లభిస్తుందని జనసేన వర్గాల అంచనాగా ఉంది. బిజెపి సైతం ఎపిలో ఆరు ఎంపి స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల విజయం సాధించింది. పురందేశ్వరి, సిఎం రమేష్, శ్రీనివాసవర్మ ఎంపిలుగా గెలిచా రు. వీరిలో పురందేశ్వరి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఆమెకు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది. అలాగే సిఎం రమేష్‌కు కూడా ప్రధాని మోడీ వద్ద ప్రాధాన్యత ఉండటంతో ఆయన కూడా కేంద్ర మంత్రి వర్గంలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే టిడిపి, జనసేనకు కూడా పదవులు ఇవ్వాల్సి ఉన్నందున బిజెపి ముగ్గురు ఎంపిల్ల్లో ఒక్కరికే చాన్స్ లభిస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.