Sunday, November 17, 2024

400 సీట్లు సాధిస్తాం: రాజ్‌నాథ్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో 400 కు పైగా సీట్ల లక్షాన్ని బీజేపీ సాధించి తీరుతుందని , కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని దేశ ప్రజల స్థిర నిశ్చయంతో ఉన్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఒక ప్రత్యేక ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ పొత్తు తమపై ఎలాంటి ప్రభావం చూపించదని, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా యూపీ ప్రజలు లబ్ధి పొందుతున్నారని రాజ్‌నాథ్ చెప్పారు.

కుల, మత ప్రసక్తి లేకుండా ఎలాంటి వివక్షకు తావులేని విధంగా తాము పనిచేస్తున్నామని , ప్రజలు కూడా దీనిని అర్థం చేసుకున్నారని అన్నారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో కూడా ఎలాంటి పసలేదని తాము అమేథీ, రాయబరేలి లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిలోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి ప్రజాదరణకు తిరుగులేదని, దక్షిణాదిలోనూ బీజేపీ సీట్లు కచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో తాను పర్యటించానని, ఆయా చోట్ల వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని తెలిపారు.

రిజర్వేషన్లు కొనసాగుతాయి
భారత సామాజిక వ్యవస్థలో రిజర్వేషన్లు అంతర్భాగమని, అవి యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రాజ్‌పుత్ ఓటర్లతో బీజేపీ పటిష్ఠ బంధం కలిగి ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే ఉంటాయి అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News