Monday, December 23, 2024

తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం: ఎడిబి డైరెక్టర్ జనరల్ పాండియన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డిజె పాండియన్ గురువారం డా బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశములో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో మూసి రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. నదిని సంరక్షిస్తూ, నదీ జలాలను సుస్థిరంగా ఉంచటం దీని ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపట్టనున్నట్లు సీఎం అన్నారు. అలాగే మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహితంగా, సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.

సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే హైదరాబాద్ లోని రెండవ దశలో చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు, రాష్ట్రములో శిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు అందించే శిక్షణ సంస్థలు ఏర్పాటు కు సహకరించాలని.. హాస్పిటల్స్ నిర్మాణమునకు, విద్యాసంస్థల హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణానికి, రాష్ట్రప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణాలకు అలాగే వేస్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను ఏర్పాటుకు ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. అనంతరం పాండియన్ మాట్లాడుతూ రాష్ట్ర పురోభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు.

ఈ సమావేశములో డిప్యూటీ ముఖ్య మంత్రి మల్లు బట్టి వీక్క్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News