Tuesday, September 17, 2024

తెలంగాణకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు,హెలికాప్టర్లు

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తక్షణ సహాయంగా అదనంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు పంపించాలని తాను విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఆదివారం బండి సంజయ్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని వెల్లండించారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయాల్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగులో చిక్కుకు పోయిన వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిపారు.

మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా కార్పెంటర్ పనులు చేసే 9 మంది వాగుపై ఉన్న ప్రకాష్ బ్రిడ్జి వద్ద చిక్కుకు పోయారని, వీరిని రక్షించేదుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని, హెలికాప్టర్లను తక్షణమే పంపించాలని కోరినట్లు వివరించారు. అలాగే ఖమ్మంలో 110 గ్రామాలు పూర్తిగా వరదలో చిక్కుకుపోయాయని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు మున్నేరు వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్‌లు పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News