Saturday, November 16, 2024

జాతీయ మీడియాలో రైతుబంధు సంబురాలు

- Advertisement -
- Advertisement -

NDTV broadcast special article on Rythu Bandhu scheme

ఎన్డీటివిలో కెసిఆర్‌పై ప్రశంసల జల్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ మీడియాలో రైతబంధు సంబురాలు హల్ చల్ చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు పరుస్తున్న రైతు అనుకూల విధానాలు జాతీయ స్థాయిలో ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి. రైతులకు ప్రతిఏటా పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు అందజేసేందుకు కెసిఆర్ సర్కారు వినూత్న రీతిలో రైతుబంధు ప్రధకం ప్రవేశపెట్టింది. ఈ పధకం ద్వారా ప్రతిఏటా ఎకరానికి వానాకాలం సీజన్‌లో రూ.5వేలు, యాసంగి సీజన్‌లో రూ.5వేలు ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేస్తుంది. ప్రతిఏటా ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఏడు వేలకోట్ల రూపాయలు రైతులకు అందజేస్తోంది.ఈ పథకం ప్రారంభమయ్యాక 2018నాటి నుంచి ఈ యాసంగి సీజన్ వరకూ మొత్తం 50వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. ప్రతియేటా ఈ పధకం ద్వారా 65లక్షల మంది రైతుల లబ్దిపోందుతున్నారు. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ.50వేల కోట్ల నగదు పంపిణీ మైలు రాయిని చేరిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మంతటా ఇటీవల రైతుబంధు సంబురాలు జరిగాయి.

సంక్రాంతికి ముందుగానే రైతుబంధు పధకం వ్యవసాయ కుంటుంబాల్లో పండగ వాతావరణం నింపింది. రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , పార్లమెంట్ సభ్యులు , ఇతర ప్రజా ప్రతినిధులు రైతుబంధు సంబురాల కార్యక్రమాల్లో పాల్గొని రైతుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. పల్లె పల్లెనా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జేజేలు పలికారు. సిఎం చిత్రపటలకు క్షీరాభిషేకాలు చేశారు. తెలంగాణ రైతుబంధు సంబురాలు జాతీయ మీడియాను ఆకర్షించాయి. ఎన్డిటివీ ప్రతినిధులు రాష్ట్రంలో రైతుబంధు పధకం పట్ల ప్రత్యేక కథనం ప్రసారం చేసి ఈ పథకాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోయారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి రైతుబంధు పథకం పట్ల వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ పధకం ద్వారా కలిగిన ప్రయోజనాలను వారిద్వారానే చెప్చించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసిఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పధకం సన్న చిన్న కారు పేద రైతుల్లో పంటల సాగు పట్ల ధైర్యం కల్పించిందని పలువురు రైతులు ఎన్టీటివికి వెల్లడించారు. ప్రతియేటా పంటల సాగుకు సకాలంలో ఎకరానికి రూ.10వేలు రెండు విడతలుగా ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేస్తున్నందువల్ల విత్తనాలు , ఎరువుల కొనుగోలు చేసుకోగలుగుతున్నట్టు తెలిపారు. సాగు ఖర్చలకోసం షావుకార్ల చుట్టు తిరిగే పనిలేకుండా పోయిందని తెలిపారు.

వ్యవసాయ అనుకూల విధానాలో 8 శాతం వృద్ధి :

ముఖ్యమంత్రి కెసిఆర్ అములు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల వల్ల వ్యవసాయరంగం వృద్ధి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2014నాటికి తెలంగాణలో 1.8శాతం మాత్రమే ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి నేటికి 8శాతం పెరిగిందని ఎన్డిటివి తన కథనంలో వెల్లడించింది.వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ , నీటిపారుదల రంగం అభివృద్ది, తదితర పధకాల అమలుతో వ్యవసాయ రంగంపైన రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో మొత్తం 2.7లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ పథకాలు ఆశించిన ఫలితాలను అందజేస్తున్నాయి. తద్వారా తెలంగాణ రాష్ట్ర జిడిపిలో వ్యవసాయరంగం వాటా 21శాతానికి పెరిగినట్టు ఎన్డిటివి ప్రసారం చేసింది. దేశ వ్యవసాయ రంగానికి షోకేస్‌గా నిలిచిన రైతుబంధు పథకం తెలంగాణ ఖ్యాతిని దేశమంతటికీ విస్తరింపచేసింది. ఆంధ్రప్రదేశ్ , పశ్చిమబెంగాల్ , చత్తిస్ గడ్ , జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కెసిఆర్ విధానాలు స్పూర్తిగా ఫెడరల్ ప్రంట్ స్వరం పెరుగుతోందని ఎన్డీటివి తన కథనంలో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News