Sunday, December 22, 2024

హమాస్ రాకెట్ దాడి.. ఇజ్రాయెల్‌లో ఎన్‌డిటీవీ టీం సేఫ్

- Advertisement -
- Advertisement -

అష్‌కెలాన్ : ఇజ్రాయెల్‌లో ఇప్పుడు సాగుతోన్న భీకరపోరు దశలో ఎన్‌డిటీవి జర్నలిస్టులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వార్ వార్తలు సేకరించేందుకు ఇక్కడికి తరలివచ్చిన టీవీ బృందం ఇజ్రాయెల్‌లోని అష్‌కెలాన్‌లో రెగినా గోరెన్ హోటల్‌లో బస చేశారు. ఈ దశలోనే మంగళవారం రాత్రి రాకెటు దాడి జరిగింది, హోటల్‌లోని వారు సురక్షితంగా ఉన్నారు, ఇక్కడ ఉన్న ఎన్‌డిటివీ బృందం తమను తాము రక్షించుకుంటూనే , విధి నిర్వహణలో భాగంగా ఈ ప్రాంతంలో రాకెటు దాడి పరిస్థితిని ప్రత్యక్షంగా ప్రసారం చేశారు. హోటల్‌లోని వారు అంతా భద్రంగా ఉన్నారు. అయితే ఆవరణలోని కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. హోటల్ కొంత భాగం ధ్వంసం అయింది. ఘటన గురించి తెలియగానే ఈ ప్రాంతానికి ఇజ్రాయెల్ భద్రతా బలగాలు తరలివచ్చాయి. హోటల్‌కు కాపలాగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News