Monday, December 23, 2024

గుజరాత్ సమీపంలో రూ. 425 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

పోర్‌బందర్(గుజరాత్): గుజరాత్‌కు సమీపంలోని అరేబియా సముద్రంలో రూ. 425 కోట్ల విలువచేసే 61 కిలోల మాదకద్రవ్యాలతో కూడిన ఒక ఇరానియన్ పడవను భారత తీర పరిరక్షణ దళం, గుజరాత్ ఎటిఎస్ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నాయి. ఈ పడవలో ఉన్న ఐదుగురు సిబ్బందిని కూడా అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ఈ దాడి జరిగింది.

భారత జలాలో నార్కోటిక్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన కచ్ఛితమైన సమాచారం మేరకు కోస్తా గార్డు, యాంటీ టెర్రరిసుస్వాడు(ఎటిఎస్) సంయుక్తంగా దాడి నిర్వహించినట్లు ఎటిఎస్ వర్గాలు తెలిపాయి. ఓఖా రేవుకు కొద్ది వందల నాటికల్ మైళ్ల దూరంలో ఒక ఇరానియన్ పడవ చేపల వేట సాగిస్తున్నట్లు గమనించిన సంయుక్త దళాలు పడవపై దాడి జరిపి సోదాలు జరపగా 61 కిలోల డ్రగ్స్ లభించినట్లు వర్గాలు వెల్లడించాయి. పడవలోని ఐదుగురు సిబ్బందిని ఓఖా రేవుకు తీసుకువచ్చి ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఏమిటో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపనున్నట్లు వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News