Thursday, January 23, 2025

గీతతో మమేకమైన కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : బెంగాల్‌లో ఆదివారం గీతాజయంతి నేపథ్యంలో అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో దాదాపు 1 లక్ష మంది సామూహికంగా భగవద్గీతను పఠించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ క్షేత్రంలోనే గీతోపదేశం చేసిన ఘట్టాన్ని స్మరించుకుంటూ గీతాజయంతి ప్రతి ఏటా జరుగుతుంది. భగవద్గీతలోని శ్లోకాలను లక్ష మంది వరకూ ఏకధాటిగా చదువుతూ ఉండగా హృద్యమైన రీతిలో కోల్‌కతాలో ప్రభాత వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సమాజంలోని భిన్న నేపథ్యాలకు చెందిన జనం ,

వయోభేధం లేకుండా సాంప్రదాయ వస్త్రాలతో చేతులలో భగవద్గీత గ్రంధాలతో గ్రౌండ్స్‌లో చేరి గీతాపఠనం చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన మహాగీతకు ప్రధాని మోడీ తమ శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇటువంటి సామూహికత సమాజంలో సామరస్యాన్ని రేకెత్తిస్తుందని కొనియాడారు. భగవద్గీత ఈ ప్రపంచానికి భారతదేశం నుంచి అందిన అమూల్యమైన కానుక అని ఈ గీతాపఠనం సందర్భంగా బెంగాల్ బిజెపి విభాగం అధ్యక్షులు సుకంత మజుందార్ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News