- Advertisement -
తరలింపు ప్రణాళిక సిద్ధం !!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి 16000 మంది భారతీయులను తరలించే ప్రణాళికను రచిస్తోంది. భారత ప్రభుత్వం పోలాండ్, రొమానియా, హంగరీ, స్లోవాకియాల సాయంతో వారిని తరలించాలనుకుంటోంది. ఈ విషయంలో విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఆ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం రష్యా దాడి చేస్తుందని భావించే ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయుల రిజిస్ట్రేషన్‌ను నెల కిందటే ఆరంభించింది. ఉక్రెయిన్‌లో విద్యార్థులు సహా 20000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 4000 మంది రష్యా ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌ను ప్రకటించక ముందే ఉక్రెయిన్‌ను వదిలిపెట్టారు.
- Advertisement -