Monday, December 23, 2024

ఇవిఎంలపై అర్జీలు 40 సార్లు తిరస్కృతి

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు ఇచ్చాయి
ఇసి అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ : బ్యాలట్ పత్రాల పద్ధతిని తిరిగి అనుసరించాలన్న అభ్యర్థనలను సుప్రీం కోర్టు తిరస్కరించిన రోజు శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఇసి) అధికారులు స్పందిస్తూ, ఇవిఎంల విశ్వసనీయతను సవాల్ చేస్తున్న పిటిషన్లను కనీసం 40 సందర్భాల్లో రాజ్యాంగ న్యాయస్థానాలు తోసిపుచ్చాయని వెల్లడించారు. ఇవిఎంలు ‘నూరు శాతం భద్రం’ అని, ఆ మెషీన్లు న్యాయమైనవేనని రాజకీయ పార్టీలకు ‘అంతరాంతరాల్లో’ తెలుసునని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ చెప్పినట్లు ఇసి అధికారులు పేర్కొన్నారు.

ఇవిఎంలలో పడిన వోట్లను వివిప్యాట్ స్లిప్‌లతో పూర్తిగా సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. ఇవిఎం విధానంలోని ఏదైనా అంశంపై ‘గుడ్డిగా అపనమ్మకం పెట్టుకోవడం’ అవాంఛిత విమర్శకు దారి తీస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ప్రజాస్వామ్యం అన్ని వ్యవస్థల మధ్య సామరస్యాన్ని, నమ్మకాన్ని నిర్మించేందుకు కృషి చేయడం గురించే’ అని పేర్కొంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం రెండు ఏకీకృత తీర్పులు వెలువరించింది. ఎన్నికల్లో తిరిగి బ్యాలట్ పత్రాల విధానాన్ని అనుసరించాలని కోరుతున్న పిటిషన్లతో సహా ఈ వ్యవహారంలో అన్ని అర్జీలను బెంచ్ కొట్టివేసింది.

సిఇసి రాజీవ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాన్ని మార్చి 16న ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో ప్రకటిస్తూ, ‘ఇవిఎంలను సవాల్ చేస్తున్న పిటిషన్లను దాదాపు 40 సార్లు రాజ్యాంగ న్యాయస్థానాలు& సుప్రీం కోర్టు, హైకోర్టులు తిరస్కరించాయి’ అని తెలియజేశారు. ఇసి ప్రచురణ ఒకదానిని ఆయన ఉటంకిస్తూ, ఇవిఎంల ఉపయోగించిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఎన్ని సార్లు ఓడిపోయాయో అది సూచిస్తోందని తెలిపారు.

‘ఇవిఎంల కారణంగానే రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. చిన్న పార్టీలు అనేకం బ్యాలట్ పత్రాల శకంలో ఉనికిలోకి వచ్చి ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. ఇవిఎంలు నిష్పక్షపాతమైనవని, రాజకీయ పార్టీలు ‘అంతరాంతరాల్లో’ ఆ విషయం గుర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.‘వాటిని ‘నూరు శాతం భద్రమైనవి, నూరు శాతం నమ్మకమైనవి’ అని కూడా రాజీవ్ కుమార్ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News