Sunday, December 22, 2024

అమెరికాలో మెక్సికన్ల తరువాత భారతీయులే

- Advertisement -
- Advertisement -

అమెరికాలో 2022 సంవత్సరంలో దాదాపు 66,000 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విధంగా వారు అమెరికా పౌరుల జాబితాలో చేరారు. గణాంకాల ప్రకారం అమెరికా సిటిజన్స్ అయిన భారతీయ సంతతి వారి సంఖ్య 65,960 అని నిర్థారణ అయింది. ఈ పరిణామంతో అమెరికాలో మెక్సికో తరువాత భారతదేశమే అమెరికాకు అతి పెద్ద రెండవ మానవ వనరుల దేశపు స్థాయిలో చేరింది. సంబంధిత కీలక విషయాలను చట్టసభల సంబంధిత కాంగ్రెషనల్ రిపోర్టులో నివేదించారు. 2022లో లెక్కలప్రకారం అమెరికాలో దాదాపు 46 మిలియన్ల విదేశీ సంతతి వారు నివసిస్తున్నారు. ఈ విధంగా వీరి సంఖ్య మొత్తం అమెరికా జనాభా 333 మిలియన్లలో దాదాపుగా 14 శాతం వరకూ ఉంది.

అమెరికా జనాభా లెక్కల సంబంధిత కమ్యూనిటి సర్వే డాటా మేరకు ఈ విషయం స్పష్టం అయింది. కాగా 2022లో అమెరికా పౌరసత్వం పొందిన విదేశీ సంతతి వారి సంఖ్య 9,69, 380 అయింది. వీరిలో అత్యధిక సంఖ్యలో మెక్సికన్లు తరువాతి స్థానంలో భారతీయులు, వరుసగా ఫిలిప్పినియులు, క్యూబావారు, డొమినిసియన్ రిపబ్లిక్ వారు ఉన్నారని ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రిసర్చ్ సర్వీస్ వెలువరించిన నివేదిక తెలిపింది. ఇక ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న మెక్సికన్ల సంఖ్య 10,638,429. తరువాతి స్థానంలో అత్యధికంగా రెండు లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. తరువాతి క్రమంలో చైనా వారు దాదాపుగా ఇదే సంఖ్యలో అక్కడ నివసిస్తున్నారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News