న్యూఢిల్లీ: భారత రిజర్వ్ బ్యాంక్ గత నెలలో రూ. 2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించిన తర్వాత ఇప్పటివరకు చెలామణిలో ఉన్న దాదాపు 50 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వాపసు వచ్చాయని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రూ. 500 కరెన్సీ నోట్లను ఉపసంహరించే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా 2016 లో రద్దు చేసిన రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఏదీ లేదని ఆయన తెలిపారు. దీనిపై ఎటువంటి ఊహాగానాలు చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2023 మార్చి 31 రనాటికి రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇప్పటివరకు రూ. 1.80 లక్షల కోట్ల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు వాపసు వచ్చినట్లు గురువారం ద్వైమాసిక విత్త విధానాన్ని విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కృష్ణకాంత్ తెలిపారు. ఊహించిన విధంగానే 85 శాతం రూ. 2,000 నోట్లు బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ల రూపంలో వస్తున్నాయని ఆయన చెప్పారు. రూ. 2,00 నోట్ల ఉపసంహరుణపై మే 19న ఆర్‌బిఐ ఒక ప్రకటన చేసింది. మే 23 నుంచి రూ. 20,000 వరకు బ్యాంకులో మార్పిడి చేసుకోవచ్చని, ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్‌కు అనుమతిస్తున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది.