Sunday, December 22, 2024

దేశానికి చదువుకున్న ప్రధాని అవసరం: సిసోడియా

- Advertisement -
- Advertisement -
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణల్లో మనీశ్ సిసోడియా ఏప్రిల్ 17 నుంచి జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

న్యూఢిల్లీ: విద్య ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్ర మోడీకి ఏమి తెలియదని జైలులో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోడియా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలనుద్దేశించి రాశారు. ఆయన బిజెపిపై ధ్వజమెత్తుతూ ‘ఆ పార్టీ రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోయింది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది’ అన్నారు. ఆయన తన ‘లెటర్ గేమ్’ ద్వారా వార్తల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది.

సిసోడియా ఇదివరలో కూడా జైలు నుంచి లేఖలు రాశారు. రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీ 2021-22 కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ సిబిఐ ఆయనను ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది.‘ఒకవేళ తక్కువ చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉంటే దేశానికి చాలా ప్రమాదం’ అన్న మనీశ్ సిసోడియా ట్వీట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘నరేంద్ర మోడీకి సైన్స్ అర్థం కాదు…మోడీకి విద్య ప్రాముఖ్యత కూడా తెలియదు’ అని కూడా సిసోడియా అన్నారు. గత కొన్నేళ్లలోనే దేశంలో 60000 పాఠశాలలు మూతపడ్డాయని ఆయన ఆరోపించారు. ‘భారత్ అభివృద్ధి చెందాలంటే చదువుకున్న ప్రధాని ఉండాలి’ అన్నారు. ‘తక్కువ చదువుకున్న ప్రధాని ఉంటే దేశంలోని యువత కలలు ఎలా పూర్తవుతాయని సిసోడియా అడిగారు. కాగా ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ‘ఇతరుల విద్యార్హతల గురించి అడిగే ముందు తన విద్యార్హతల గురించి చెప్పడం మంచిది’ అని సిసోడియాను విమర్శించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News