Monday, July 1, 2024

లోక్ సభ కు హాజరయ్యేందుకు పడవ కోరిన శశి థరూర్ ?!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తన ఇల్లు వాన నీళ్లలో మునిగిపోయిన వీడియోను పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ షేర్ చేశారు. రానున్న వారం రోజుల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడనున్నాయని మరో వైపు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శశిథరూర్ లుటియన్స్ ఇల్లు వాణ నీళ్లలో మోకాలు లోతు వరకు కూరుకుపోయి ఉంది. వాన నీళ్లు ఆయన్ని పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా అడ్డుకున్నాయి.

ఢిల్లీలో శుక్రవారం కురిసిన వానలు ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలను నీళ్లలో ఉండేలా ముంచి ఉంచాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ఉరుములతో కూడిన  భారీ వర్షం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి.

తన ఇంటి ముందు నీళ్లు నిలిచిపోయి ఉన్న వీడియోను శశి థరూర్ ఎక్స్ వేదికలో షేర్ చేశారు. ‘‘ ఇంట్లో ఉన్న కార్పెట్లు, ఫర్నీచర్, నేల మీద ఉన్న వస్తువులన్నీ పాడైపోయాయి. నీరు పోయేందుకు దారి లేకపోవడంతో నిల్వ ఉండిపోయాయి’’ అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు.

తర్వాత  ‘‘ పడవ లేకుంటే నేను పార్లమెంటుకు రాలేనని నా కొలీగ్స్ కు తెలిపాను. అయితే పంపుల ద్వారా రోడ్ల మీద నీటిని తోడేశారు. అందుకనే నేను సమయానికి పార్లమెంటుకు రాగలిగాను’’ అని తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ తెలిపారు. అయితే పార్లమెంటులో ‘నీట్’ అంశం కారణంగా సభలో గలాభా చోటుచేసుకుని వాయిదా పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News