Saturday, April 5, 2025

అందరిలో పర్యావరణ స్పృహ అవసరం : ఎంపి సంతోష్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యతగా వ్యవహారించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఓజోన్ రన్ 2వ ఎడిషన్ భాగంగా 10కె,5కె,2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి సంతోష్ రన్నర్స్‌కి ట్రోఫీలను అందజేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్వర్యంలో విత్తన గణపతులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచేలా ఓజన్ రన్ ను నిర్వహించిన వ్యవస్థాపకులు బిల్వోవా వున్నం, తీర్ధా వున్నంల చొరవను అభినందించారు. ఓజోన్ రన్ వ్యవస్థాపకురాలు మేఘనా ముసునూరి, కార్యదర్శి శ్రీధర్ వున్నం నేతృత్వంలోని సేవ్ వాటర్ అండ్ నేచర్ చొరవతో పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు వెయ్యికి పైగా రన్నర్స్ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డిసిపి సందీప్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

గట్టి నాయకుడు కెసిఆర్… ఎక్స్‌లో పోస్టు..
వినాయక చవితి పండుగ సందర్భంగా కార్డునిస్ట్ వేసిన చిత్రాన్ని ఎక్స్‌లో ఎంపి సంతోష్ పోస్టు చేశారు. గణేశుడు మన లెజెండరీ లీడర్ కెసిఆర్‌పై తనఆశీర్వాదాలను కురిపించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడు.. పాలనా దక్షతకు గట్టి నాయకుడు కెసిఆర్ స్ఫూరించేలా వేసిన చిత్రాన్ని ఎక్స్‌లో ఎంపి పోస్టు చేశారు. అదే విధంగా పలు పక్షుల చిత్రాలను సంతోష్ పోస్టు చేశారు. జాతీయ రహదారుల్లో ప్రయాణీంచే సమయంలో వన్యప్రాణుల సంరక్షణకు,బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయాలని కోరారు.

Cartoon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News