Sunday, January 19, 2025

మోడీ ఆశీస్సులు కావాలి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు కావాలని కోరారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయభేరీ మోగించిన అనంతరం బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ పౌర సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రధాని మోడీ ఆశీస్సులతోపాటు బిజెపి, కాంగ్రెస్ సహకారం కావాలని అన్నారు.

ప్రపంచంలో భారత్ అగ్రదేశంగా ఎదిగేందుకు దేశంలో సానుకూల రాజకీయాలు ఏర్పడాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ఇందుకు బిజెపి, కాంగ్రెస్‌తోసహా అందరి సహకరారం అవసరమని ఆయన అన్నారు.

ప్రతికూల బిజెపికి ఓటమి: సిసోడియా

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆప్‌కు విజయాన్ని అందచేసిన ఢిల్లీ ప్రజలకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూల పార్టీ అయిన బిజెపిని ఢిల్లీ ప్రజలు చిత్తుగా ఓడించారని ఆయన అన్నారు. నిజాయితీగా ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న ఆప్‌కు ప్రజలు పట్టం కట్టారని ఆయన అన్నారు. ఇది తమకు గొప్ప విజయమేకాక గొప్ప బాధ్యత కూడానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News