Monday, December 23, 2024

బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషిన్‌షిప్ లో ఉంటే జట్టులోకి తీసుకుంటారా?: బధ్రీనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీలంకతో జరిగే టి20, వన్డే సిరీస్‌కు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన టీమిండియా జట్టుపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్‌ను టీమ్‌లోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కొందరికి జట్టులోకి అనూహ్యంగా తీసుకోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిఎస్‌కె కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదని సిఎస్‌కె మాజీ బ్యాటర్ ఎస్ బద్రీనాథ్ తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. జింబాబ్వే పర్యటనలో మెరుగ్గా రాణిస్తున్న అతడిని పక్కన పెటడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

టాలెంటెడ్ ఆటగాళ్లు జట్టుకు ఎంపిక కానప్పుడు ఆటగాళ్ల బ్యాడ్ బాయ్ ఇమేజ్ కలిగి ఉండడం ఇప్పుడు అవసరమనిపిస్తుందని చురకలంటించారు. ఎప్పుడు జట్టులో ఉండాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషిన్‌షిప్ మెయింటెయిన్ చేయాలా? అని ప్రశ్నించారు. ఒళ్లంతా టాటూలు వేయించుకోవడంతో పాటు మీడియా మేనేజర్ ను కలిగి ఉండాలా? అని ఎద్దేవా చేశారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ సెంచరీతో ఆకట్టుకోవడంతో రెండు మ్యాచ్ లో రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. రుతురాజ్ 77, 49 పరుగులు చేసి బ్యాటింగ్‌లో నిరూపించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో ఆకట్టుకోని రియాన్ పరాగ్ శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ ఎలా? సెలక్ట్ చేశారని విమర్శలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News