Friday, December 20, 2024

మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా..?

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ : మూడు పంటలు కావాల లేక మూడు గంటల కరెంట్ కావాలా ప్రజలు ఆలోచించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండంలోని కాట్రపల్లి, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపయ్యపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ రాత్రులంతా కరెంట్ కోసం పడిగాపులు గాసిన రోజులు చూశామని అన్నారు. తెలంగాణ ఉద్యమమే కరెంట్ మీద పుట్టిందని, రైతులను కాల్చి చంపింది చంద్రబాబు నాయకుడు కాదా ప్రశ్నించారు. 2001 నాడు కరెంట్ ఉద్యమం ఎత్తుకున్నది కేసిఆర్ కాదా ప్రజలు గమనించాలని అన్నారు.

నేడు 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది సియం కేసిఆర్ అని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రైతు భీమా, రైతు బంధు, 24గంటల కరెంట్‌తో పాటు ఆసరా పెన్షన్ ఇతర పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ బిజెపి పార్టీలు సర్వే చేస్తే కౌశిక్ రెడ్డి గెలుస్తాడన్నా విషయం పట్ల జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.

కౌశిక్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభివృద్ది అంటే ఎంటో చూపిస్తానని అన్నారు. రైతును రాజు చేయడమే రాష్ట్రముఖ్యమంత్రి కేసిఆర్ లక్షమని అన్నారు.అభివృద్దిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిత్యం దుమ్మెత్తిపోస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News