Saturday, November 23, 2024

ప్రతి గింజా ‘కొనాల్సిందే’

- Advertisement -
- Advertisement -

Need to buy whole Paddygrain

అంతవరకు కేంద్రాన్ని వదిలిపెట్టం : వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం తీరు
రాష్ట్రానికి గుదిబండ ఏ రాష్ట్రానికి లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకే ఎందుకు పెడుతున్నారు:
పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ వెళ్లిన మంత్రులు
నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ బృందం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటకింద రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేదాక కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఎంసిహెచ్‌ఆర్‌డిలో రాష్ట్రంలో యాసంగి ధాన్యంపై మంత్రి అధికారులతో సమావేశం ని ర్వహిచారు. ఈ సందర్బంగా మంత్రి మీడియా తో మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామన్నారు పంజాబ్ లో మద్దతు ధర కు వరి ధాన్యం కొంటున్నట్టు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు రాష్ట్రానికి చెందిన ఎంపిలు,మంత్రులు,అధికారులతోపాటు అందరం కేంద్ర మంత్రిని కలుస్తామ ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి వాస్తవలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పట్టిచ్చిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర ఎందుకు పెట్టుకుంటుందని ప్రశ్నించారు.

రాష్ట్రం పట్టిచ్చిన బియ్యంను కేంద్రమే తీసుకువెళ్లాల్సివుందని,కానీ తీసుకు వెళ్లకుండా ఉల్టాగా మమ్ములనే అనడం విడ్డూరంగా ఉందన్నారు. రైల్వే రేకులను సమకూర్చమంటే సమకూర్చలేదన్నారు. కర్ణాటకలో ఎరువుల సరఫరా కు రేకుల అవసరం చెప్పిన కేంద్రమంత్రి మళ్ళీ మాపై నిందలు వేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రుల నుండి స్పష్టమైన హామీ రాకపోతే రాష్ట్రం ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలను సిఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారని , దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. కేం ద్రం ధాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆశాఖ మంత్రి మాట్లాడాలి లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలే తప్పబండిసంజయ్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం తరపున మాట్లాడాల్సివస్తే స్పష్టమైన హామీతో మాట్లాడాలేతప్ప ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ వడ్లే కొంటాం.. అవడ్లే కొంటాం అని అంటే ఎలాగన్నారు. సిఎం కేసిఆర్‌ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీకి చేరిన మంత్రుల బృందం :

యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం నాడు ఢీల్లికి చేరకుంది? మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ , పువ్వాడ అజయ్‌తో కూడిన ఈ బృందం బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడిని , సంబంధిత మంత్రులను కలిసేందకు ప్రయత్నాలు చేస్తోంది. శంశాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరేముందు రాష్ట్ర పౌరసరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నామన్నారు.రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీరు గుదిబండగా మారిందన్నారు. తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు గురవుతోందన్నారు.బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి ,కేంద్ర మంత్రితోపాటు సంబంధిత అధికారులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు .

రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఇబ్బందులు మా రాష్ట్ర రైతులకు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రైతులు వేసిన పంటలు అన్ని కూడా కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు.పంజాబ్ లో పండించిన గోధుమలు కొని తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం ఎందుకు కొనరని నిలదీశారు.బాయిల్డ్ రైస్ పరిచయం చేసింది ఈ ఎఫ్‌సిఐ అని , అలాంటపుడు ఎందుకు ఇక్కడి బాయిల్డ్ రైస్ కొనరని ప్రశ్నించారు. గోధుమలు పండిస్తే పిండి చేసి ఇవ్వడం లేదుగా, పత్తి పండిస్తే బెల్ చేసి ఇవ్వడం లేదుగా, మరి వడ్లు ఎందుకు బియ్యం చేసి ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తో తాడోపేడో తేల్చుకొని వస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News