Sunday, December 22, 2024

అసంతృప్తితో నీలం మధు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బి ఫామ్ తీసుకోడానికి గాంధీభవన్‌కు వెళ్లిన నీలం మధుకు నిరాశే ఎదురయ్యింది. ఎఐసిసి నుండి ఇంకా ఆదేశాలు రాలేదని గాంధీభవన్ నేతలు చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నీలం మధు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు బిఆర్‌ఎస్ నుంచి పటాన్ చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అక్కడ టికెట్ లభించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రచారం చేసిన ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో నామినేషన్ వేయడానికి బి ఫామ్ కోసం నీలం మధు గాంధీభవన్‌కు వెళ్లారు. కాగా ఎఐసిసి నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని గాంధీభవన్ నేతలు మధుకు తెలిపారు. దీంతో లీస్టులో పేరున్నా బి ఫామ్ ఇవ్వడం లేదంటూ గాంధీభవన్ నుంచి నీలం మధు ఆగ్రహంతో వెళ్లిపోయినట్లు ఆయన అనుయాయులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News