- Advertisement -
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఆదివారం తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. టిజెఎస్ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మదత్తు తెలిపి, గెలుపుకు సహకరించాలని కోరారు. త్వరలో మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజాసంఘాల న్నింటిని సమన్వయం చేసి సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రొ. కోదండరాం నీలం మధుకు హామినిచ్చారు. టిజెఎస్ కాంగ్రెస్ మిత్రపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
- Advertisement -