- Advertisement -
నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కావడంతో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజులు ఒకే సమయంలో తమ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం భారీ ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరువర్గాలు ఒకే సారి రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ కాటా శ్రీనివాస్, నీలం మధు ఆర్వో కార్యాలయంలోపలికి వెళ్లి నామినేషన్లు వేశారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరు ప్రకటించినప్పటికీ బి ఫాం మాత్రం కాటా శ్రీనివాస్‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం నీలం మధు బిఎస్పీలో చేరి బి ఫాం అందుకున్నారు.
- Advertisement -