Monday, December 23, 2024

వేప చెట్లకు ఏమైంది.. చెట్ల తెగులుపై…

- Advertisement -
- Advertisement -

కొమ్మల ముడత (లేదా) డైబ్యాక్ అని పిలువబడే విధ్వంసక వ్యాధి కారణంగా వేప చెట్లు ముప్పును ఎదుర్కొంటున్నాయని డాక్టర్ జగదీష్ (ప్లాంట్ పాథాలజిస్ట్) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తోంది. ఆగస్టు-డిసెంబర్ లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాకాలం మొదలైన సమయంలో లక్షణాలు కనిపించడం ప్రారంభమైతుంది. వర్షాకాలం చివరి భాగంలో శీతాకాలంలో క్రమంగా తీవ్రమవుతుంది.

విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి సంక్రమణను తగ్గిస్తోంది. మొలక, నారు దశలో కార్బండాజిమ్ 2.5 గ్రాములు లీటరు నీటికి లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు ఖచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాధులకు నిరోధకతను కలిగిస్తాయి. వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని చాలా తట్టుకుంటుంది. తరచుగా ఫంగస్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదు. ఎటువంటి బాహ్య ప్రమేయం లేకుండా వ్యాధితో పోరాడి జీవించగలదు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో లాబొరేటరీ అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. వ్యాధికారక కారకాన్ని ఫోమోప్సిస్ అజాడిరచ్టేగా గుర్తించారు. తెలంగాణలో వరుసగా మూడేళ్లుగా మళ్లీ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, మన వేప చెట్లు డైబ్యాక్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడానికి చాలా బలంగా ఉన్నాయి. చెట్లు వ్యాధికారక క్రిములు సహ-పరిణామం చెందుతాయి. కాలానుగుణంగా చెట్లపై వివిధ తీవ్రతతో వ్యాధులు సంభవిస్తాయి అనే వాస్తవాన్ని అంగీకరించేంత బలంగా ఉండాలి. వేప డైబ్యాక్ ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించిన ఏవైనా సందేహాల కోసం దయచేసి సంప్రదించండని డాక్టర్ జగదీష్ తెలిపారు.

డాక్టర్ జగదీష్
ప్లాంట్ పాథాలజిస్ట్
Ph.: 9705893415
ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ములుగు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News