చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం సాధించి కోట్లాది మంది భారతీయులకు హీరోగా యువ అథ్లెట్ నీరజ్ చోప్రా మంగళవారం హర్యానాలోని పానిపట్ సమీపంలో ఉన్న స్వగ్రామం సమల్ఖాకు బయలుదేరి వెళ్లాడు. అయితే రాజధాని ఢిల్లీ నుంచి పానిపట్ వరకు భారీ కాన్వయ్‌తో బయల్దేరగా స్వగ్రామం చేరుకునేలోపే నీరజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్‌పై నిలబడి అందరికీ అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నాడు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ యాత్రతో నీరజ్ పూర్తిగా నీరసించిపోయాడు. ఈ క్రమంలో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తలించారు. అయితే నీరజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. భారత్‌కు వచ్చినప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అతను అలసి పోయాడని, అందువల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Neeraj chopra admitted to Panipat Hospital