- Advertisement -
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో విభాగంలో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో నీరజ్ చోప్రా అగ్రస్థానాన్నిదక్కించుకున్నాడు. టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
తాజాగా నీరజ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో జావెలిన్ త్రో విభాగంలో అగ్రస్థానంలో నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
- Advertisement -