- Advertisement -
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్ త్రో విభాగంలో పసిడి పతకం గెలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నీరజ్ చోప్రా తాజాగా ప్రతిష్టాత్మకమైన లారెస్ స్పోర్ట్ అవార్డు రేసులో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా పురస్కారంగా లారెస్ అవార్డు పేరు తెచ్చుకుంది. భారత్ తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. కాగా 2022 సంవత్సరానికి గాను నీరజ్‌తో పాటు మరో ఐదుగురు ఆటగాళ్లు అవార్డు రేసులో నిలిచారు.
- Advertisement -