Monday, December 23, 2024

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు నీరజ్ చోప్రా

- Advertisement -
- Advertisement -

పారీస్:  డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మంగళవారం ఇక్కడ జరిగిన ఒలింపిక్ క్రీడల పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు 89.34 మీటర్ల త్రో తో  అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ లో అతని ప్రదర్శన మాదిరిగానే, అతను తన ఓపెనింగ్ త్రో లోనే 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫైయింగ్ మార్క్ ను దాటాడు.

పోటీలో ఉన్న మరో భారతీయుడు కిషోర్ జెనా 80.73 మీటర్ల బెస్ట్ త్రో చేసినప్పటికీ  12 మందితో కూడిన ఫైనల్‌ పోటీకి చేరే అవకాశం లేదు.

కామన్వెల్త్ గేమ్స్  లో ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా 86.59 మీటర్ల త్రో తో ఫైనల్స్‌కు అర్హతను సాధించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News