జావెలిన్ త్రోలో ఫైనల్‌కు అర్హత
టోక్యో: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన అర్హత పోటీలో నీరజ్ చోప్రా అసాధారణ ఆటతో ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. మొదటి అవకాశంలోనే 86.65 మీటర్లు విసిరి గ్రూప్7లో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అర్హత మార్క్ 83.50 మీటర్లను అలవోకగా అందుకున్న నీరజ్ పతకం ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు. ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే నీరజ్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నాడు. విపరీత పోటీ ఉండే ఒలింపిక్స్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అలవోకగా ఫైనల్‌కు చేరడం గమనార్హం. సహచరుడు శివ్‌పాల్ సింగ్ మాత్రం నిరాశ పరిచాడు. గ్రూప్‌బి క్వాలిఫయింగ్ రౌండ్‌లో శివ్‌పాల్ పేలవమైన ప్రదర్శన చేశాడు. కనీసం ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేక పోయాడు. అంతకుముందు తజిందర్ పాల్ సింగ్ తదితరులు కూడా ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.