న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. కాగా తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో అతడి గజ్జలో గాయమైంది. ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, పరుగెత్తుతున్నప్పుడు తొడ కండరాలు పట్టేశాయని నీరజ్ చోప్రా పతకం సాధించిన అనంతరం చెప్పాడు.
అయితే అతడి గాయం ప్రస్తుతం తీవ్రం కావడంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. “ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయం కాణంగా కామన్వెల్త్ గేమ్స్‌లో భాగం కాలేకపోతున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము” అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్విటర్‌లో పేర్కొంది.
యూజీన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం చోప్రా చారిత్రాత్మక రజత పతకాన్ని గెలుచుకున్నాడు, పోటీ సమయంలో అతని గజ్జల్లో ఒత్తిడికి గురయ్యాడు. భారత జట్టు చెఫ్ డి మిషన్ రాజేష్ భండారీ పిటిఐతో మాట్లాడుతూ, “కొత్త జెండా బేరర్‌ను నిర్ణయించడానికి మేము ఆ రోజు తర్వాత సమావేశం అవుతాము” అన్నారు.
Our Olympic Champ @Neeraj_chopra1 will not be defending his title at @birminghamcg22 due to concerns regarding his fitness. We wish him a speedy recovery & are supporting him in these challenging times.#EkIndiaTeamIndia #WeareTeamIndia pic.twitter.com/pPg7SYlrSm
— Team India (@WeAreTeamIndia) July 26, 2022