యుజీన్: అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించాడు. ఆదివారం జరిగిన జావెలీన్ త్రో ఫైనల్‌లో 88.13 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. స్వర్ణ పతకమే లక్షంగా నీరజ్ తన మొదటి ప్రయత్నాన్ని ఫౌల్ త్రోతో ప్రారంభించాడు. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి.. 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడో ప్రయత్నంలో 86.37 మీటర్లు విసిరాడు. అనంతరం నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ బంగారు పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, 2003లో అథ్లెటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్ జంప్‌లో కాంస్య పతాకాన్ని అంజు బాబీ జార్జ్ గెలుచుకున్న ఏకైక భారతీయురాలిగా నిలిచింది. 2022లో నీరజ్ మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పతాకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు.
చాలా సంతోషంగా ఉంది : నీరజ్
పతకం అందుకున్న అనంతరం నీరజ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ‘ప్రపంచ ఛాంపియన్‌షిలో పతకాన్ని ఎంతో గర్వంగా ఉంది. అథ్లెటిక్స్‌కు ఇక్కడ తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒలింపిక్స్‌లో కంటే ఎక్కువ పోటీ ఇక్కడ కనిపిస్తుంది. ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ టోర్నీలో రికార్డే అధికం. ఈ సారి చూస్తే త్రోయర్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో నాకు అవకాశమున్నంత వకరూ శాయశక్తుల్లా ప్రయత్రించా. నా ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ సవాళ్లతో కూడిన పరిస్థితులు, తీవ్ర పోటీ నడుమ పతకం సాధించడం సంతృప్తి కలిగించింది’ అని వెల్లడించారు.
అన్నురాణికి నిరాశే..
మహిళల విభాగంలో భారత అథ్లెట్ అన్నురాణి(జావెలీన్ త్రో)కి నిరాశే మిగిలింది. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండోసారి ఫైనల్‌కు వెళ్లిన ఆమె పతకాన్ని నిలబెట్టుకోలేక పోయింది. ఫైనల్లో అన్నురాణి మొదట ప్రయత్నంలో 56.18 మీటర్లు, విసిరిన రెండో ప్రయత్నంలో 61.12 మీ, మూడో ప్రయత్నంలో 59.27 మీ, నాలుగో ప్రయత్నంలో 58.14 మీ, అనంరతం 59.98 మీ జావెలిన్‌ను విసిరింది. దీంతో ఆమె పతకం రేసు నిలబడలేకపోయింది. కాగా, ఈ ఈవెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ కెలిసి బార్బర్ (ఆస్ట్రేలియా) స్వర్ణం గెలవగా.. కారా వింగర్ (అమెరికా) రజతం, హరుకా(జపాన్) కాంస్యం పతకాలు గెలుచుకున్నారు.
Neeraj Chopra win Silver at World Athletics Championships