Friday, November 15, 2024

నీరజ్ ఈటెకు రూ.1.50కోట్లు

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra’s javelin goes for ₹1.5 crore in e-auction

 

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతుల ఇ వేలంలో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం ఆధించి చరిత్ర సృష్టించి జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెకు అత్యధిక ధర లభించింది. టోక్యో క్రీడల్లో తాను ఉపయోగించిన ఈటెను నీరజ్ చోప్రా ప్రధానికి బహూకరించాడు. మరోవైపు తనకు వివిధ వ్యక్తులు, ప్రముఖులు, క్రీడాకారుల నుంచి లభించిన వస్తువులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేలంలో ఉంచారు. ఇక ఇవేలం పాటలో నీరజ్ చోప్రాకు చెందిన ఈటెకు రికార్డు ధర లభించింది. చోప్రా ఉపయోగించిన ఈటె ఇవేలంలో రూ.కోటిన్నర ధర పలికింది. భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధు ఒలింపిక్స్‌లో ఉపయోగించిన రాకెట్‌కు కూడా మంచి ధర లభించింది. ఇవేలంలో సింధుకు సంబంధించిన రాకెట్ రూ.80 లక్షల ధరకు అమ్ముడు పోయింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన ఫెన్సర్ భవానీ దేకి కత్తికి కూడా రికార్డు ధర లభించింది. భవానీ దేవి కత్తికి రూ.1.25 కోట్ల ధర దక్కింది.

పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన సుమిత్ బళ్లెం రూ.కోటి 25 వేల ధర పలికింది. పారాలింపిక్స్ విజేతలు సంతకాలు చేసి ప్రధానికి బహూకరించిన కండువాకు కోటి రూపాయల ధర లభించింది. బాక్సింగ్ సంచలనం లవ్లీనా ఉపయోగించిన చేతి గ్లౌజులు 91 లక్షల రూపాయలకు అమ్ముడు పోయాయి. కాగా, ఆటగాళ్లు అందించిన క్రీడా పరికరాలతో పాటు పలు సందర్భాల్లో తనకు వచ్చిన జ్ఞాపికలు, బహుమతులను ప్రధాని ఇవేలం వేశారు. మొత్తం 1348 వస్తువులను ఇవేలం ఉంచారు. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా లభించిన నిధులను గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇవేలం పాటను నిర్వహించారు. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఇవేలం అక్టోబర్ ఏడున ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News