Saturday, December 21, 2024

ఆ ఫీట్‌ను సాధించడమే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా

Neeraj Chopra nominated for Laureus Award

న్యూఢిల్లీ : ఒలింపిక్స్, ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ ఆటగాడు భవిష్యత్తులో అరుదైన ఫీట్‌ను సాధించడంపై దృష్టి పెట్టాడు. ఏదో ఒక రోజు 90 మీటర్ల దూరంలో బల్లెంను విసిరి చరిత్ర సృష్టిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో రజతం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ నిలిచాడు.

2003లో చివరిసారి అంజు బాబి జార్జి లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ ఆ తర్వాత భారత్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం అందించిన ఘనత నీరజ్ చోప్రాకు మాత్రమే దక్కుతోంది. ఇక టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి కొత్త చరిత్రను లిఖించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం స్వర్ణం సాధించడంలో విఫలమయ్యాడు. ఫైనల్లో నీరజ్ చోప్రా ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు.

90 మీటర్లు విసరడం ఖామని భావించినా నీరజ్ మాత్రం ఆ ఫీట్‌ను అందుకోలేక పోయాడు. 88.13 మీటర్ల దూరం మాత్రమే విసిరి రజతంతో సంతృప్తి పడ్డాడు. ఇక గ్రెనెడాకు చెందని అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల దూరంలో బల్లెం విసిరి స్వర్ణం సాధించాడు. మరోవైపు నీరజ్ అభిమానులు మాత్రం నీరజ్ నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నారు. నీరజ్ కూడా అభిమానుల ఆశలను నెరవేర్చాలనే పట్టుదలతో ఉన్నాడు. ఏదో ఒక రోజు 90 మీటర్ల ఫీట్‌ను సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తానని హామీ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News