Sunday, September 22, 2024

నీట్2023లో నారాయణ విజయ పరంపర

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2023 ఫలితాల్లో నారాయణ తన విజయ పరంపరను కొనసాగించింది. ఆలిండియా స్థాయిలో 10 లోపు ర్యాంకుల్లో 4, 100 లోపులో 35 ర్యాంకులతో తన ఆధిపత్యాన్ని చాటు కుంది. అలిండియా ర్యాంకుల్లో శశాంక్ సిన్హా 4వ స్థానంలో నిలిచి సంచలన విజయం అందకున్నారు. వీటితో పాటు అలిండియా 100 లోపు ర్యాంకుల్లో అన్ని కేటగిరిల్లో 4,7,8,8,12,12,15,19,19,20,24,31,37,38,47,51,51,51,52,53,55,56,57,62,68,69,79,80,85,89,93,97 మొత్తం 35 ర్యాంకులను నారాయణే కైవసం చేసుకుంది. అదేవిధంగా 500 లోపు 112, 1000లోపు 169 ర్యాంకులను సాధించడం ద్వారా నారాయణ సరికొత్త రికార్డును సృష్టించిందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ డా.పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.

విశిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన స్టార్ సిఓ బ్యాచ్ ఎన్40 ప్రోగ్రామ్‌ల ద్వారా టాఫ్ ర్యాంకుల సాధనను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామన్నారు. సిబిఎస్‌ఈ సిలబస్ ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కోసం అత్యంత వినూత్న విద్యా ప్రణాళికల వల్లే ఈ టాప్ ర్యాంకులు సాధించగల్గుతున్నామని చెప్పారు. సిబిఎస్‌సి బయాలజీ సబ్జెక్ట్‌లో తెలుగు విద్యార్థులు ఏలాంటి ఇబ్బందులు పడకుండ ఫిజిక్స్, కెమిస్ట్రీలో సిబిఎస్‌ఈ వారు తయారు చేసే ప్రశ్న ప్రతాలకు అనుగుణంగా అకడమిక్ ప్రణాళికలను తయారు చేసి కాన్సెప్ట్ బేస్‌డ్‌విధానాన్ని పరిగణలోకి తీసుకోవడం వల్లే అత్యధిక సంఖ్యలో టాప్ ర్యాంకులు సాధించగల్గుతున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా మూడుసార్లు ఎఐపిఎంటి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఒక్క నారాయణ విద్య సంస్థదే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇంతటి ఘన విజయాలను సాధించడానికి ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ప్రణాళికలను అనుగుణంగా రూపుదిద్దిన మైక్రో షెడ్యూల్స్, ఎక్స్‌ఫర్ట్‌లతో రూపొందించిన స్టడీ మెటిరియల్ అనుభవజ్జులైన అధ్యాపకులతో బోధన రోజువారి టెస్టులు వాటిపై సమగ్ర విశ్లేషణతో బలహీనతలను అధిగమిస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకుపోయ్యేలా ప్రతి విద్యార్ధిని తయారు చేస్తున్నట్లు సింధూర నారాయణ, శరణి నారాయణ చెప్పారు.. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులకు అధ్యాపక బృందాలకు వారు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News