Monday, January 20, 2025

‘నీట్ ’లో భారీ కుంభకోణం జరిగిందని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన

- Advertisement -
- Advertisement -

జాతీయ ప్రవేశ పరీక్ష ‘నీట్ ’ పరీక్షలో భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద శనివారం ఆందోళన నిర్వహించింది. మోడీ డౌన్, డౌన్ అంటూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిగా అక్కడకు చేరుకున్న బిజెపి కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పోటా పోటీ నినాదాలతో హోరెత్తించారు. బిజెపి కార్యాలయం వైపునకు వస్తున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను బిజెపి కార్యకర్తలను అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాసేపు ఇరువర్గాల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు బిజెపి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News