Sunday, June 30, 2024

మార్కుల గణనపై ఎన్‌టీఏకు సుప్రీం కోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024లో అవకతవకలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎన్‌టీఏ ( నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 8 వ తేదీలోగా దీనికి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్ యూజీ 2024 పై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదే రోజు విచారణ చేపడతామని పేర్కొంది. నీట్ యూజీ 2024 మార్కుల గణనలో ఇష్టారీతిన వ్యవహరించారంటూ పిటిషన్‌ను ఓ లెర్నింగ్ యాప్ దాఖలు చేసింది. మెడికల్ పరీక్షకు హాజరైన చాలామంది ఓఎంఆర్ షీట్లను పొందలేదని పేర్కొంది.

దీనిపై గురువారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ బెంచ్ గురువారం వాదనలను ఆలకించింది. “ఒఎంఆర్ షీటు ఇవ్వడానికి ఏడైనా టైమ్‌లైన్‌ను మీరు పెట్టుకొన్నారేమో తెలియజేయండి. దీనిపై ఎన్‌టీఎను స్పందించనీయండి ” అని బెంచ్ పేర్కొంది. సంబంధిత పార్టీలు ఈ అంశంపై జులై 8 వ తేదీ లోగా వివరణలు పంపాలని ఆదేశించింది. అదే సమయంలో కోచింగ్ సెంటర్లు పిటిషన్లు దాఖలు చేయడాన్ని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది.

“ఇది కోచింగ్ సెంటర్ల వైపు నుంచి వచ్చిన 32 వ పిటిషన్. ఇందులో మీ ప్రాథమిక హక్కులకు ఏం ఉల్లంఘన జరిగింది ? ఈ అంశంలో వారు పోషించడానికి ఏ పాత్ర కనిపించడం లేదు. చెప్పిన సేవలు అందించడంతోనే వారి పాత్ర ముగుస్తుంది. కేంద్రం చేయాల్సిన పనులను వారు చూడాల్సిన అవసరం లేదు ” అని పేర్కొంది. ఓవైపు సుప్రీంలో విచారణ జరుగుతుండగా, మరోవైపు సీబీఐ దర్యాప్తు జోరందుకుంది. నీట్ లీకులకు సంబంధించిన పలు అనుబంధ కేసులను పరిశీలిస్తోంది. ఈ కేసులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలో అవకతవకలకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News