Wednesday, January 22, 2025

వచ్చే నెలలో నీట్, జెఇఇ షెడ్యూల్..?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జెఇఇ మెయిన్, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ సహా ఇతర జాతీయ పరీక్షల షెడ్యూల్ అక్టోబర్ నెలలో వెలువడే అవకాశం ఉన్నది. జెఇఇ మెయిన్‌ను యథావిధిగానే రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిసింది. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్‌లో రెండో విడత జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది. మొదటి విడత జెఇఇ మెయిన్‌కు డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఆయా పరీక్షల తేదీలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సిబిఎస్‌ఇ, ఇతర బోర్డుల 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలించి, అందుకు అనుగుణంగా నీట్, జెఇఇ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. దేశంలోని ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటి, ఇతర విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జెఇఇ మెయిన్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో టాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ప్రతిష్టాత్మక సంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)ల్లో ప్రవేశాలకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News