Tuesday, January 21, 2025

కోటాలో మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

కోటా: రాజస్తాన్ లోని కోటాలో మరో నీట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాంచికి చెందిన రిచా సిన్హా(16), కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటూ విజ్ఞాన్ నగర్ లోని ఓ ప్రవేటు హాస్టల్ ఉంటోంది. అయితే, మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తను ఉంటున్న హాస్టల్ గదిలో రిచా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న విజ్ఞాన్ నగర్ పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంబిఎస్ ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ గదిలో రిచా రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, కోటాలో నీట్ కోచింగ్ కోసం వచ్చిన వారిలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడంపై ఆందోళన వ్యక్తం మవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకోగా, గతేడాది 15మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News