Tuesday, December 24, 2024

నీట్ నిర్వహణలో నిర్లక్ష్యమా?

- Advertisement -
- Advertisement -

ఈ పరీక్షకు సన్నద్ధం కావడానికి విద్యార్థులు ఎంత కష్టపడుతారో తెలియదా?
వ్యవస్థను వంచించే వ్యక్తి వైద్యుడైతే సమాజానికే చేటు 0.001%
నిర్లక్షం ఉన్నా పరిష్కరించాల్సిన బాధ్యత ఎన్‌టిఐదే 
నీట్ అవకతవకలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం

జులై 8న తదుపరి విచారణ

న్యూఢిల్లీ: నీట్ యుజి 2024 నిర్వహణలో ఎవరి పరంగానైనా ‘0.001%నిర్లక్షం’ ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడానికి విద్యార్థులు అమితంగా శ్రమించవలసి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తంచేస్తూ, నీట్ 2024 పరీక్షకు సంబంధించిన దావాను వ్యతిరేకమైనదిగా పరిగణించరాదని సూచించింది.

‘ఎవరి పరంగానైనా 0.001 శాతం నిర్లక్షం ఉన్నట్లయితే దానిని పూర్తిగా తేల్చవలసి ఉంటుంది’ అని న్యాయమూర్తులు విక్రమ్ భట్, ఎస్‌విఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ కేంద్రం, జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ) తరఫున హాజరవుతున్న న్యాయవాదులతో అన్నది. ఎన్‌టిఎ అఖిల భారత ప్రీ వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంటుంది. మే 5న నిర్వహించిర పరీక్షలో విద్యార్థులకు ప్రదా నం చేసిన గ్రేస్ మార్కులతో సహా ఫిర్యాదులతో దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను బెంచ్ విచారిస్తోంది.

‘పిల్లలు ముఖ్యంగా ఈ పరీక్షలకు ఎటువంటి కష్టం పడతారో మన అందరికీ తెలుసు’ అని బెంచ్ పేర్కొన్నది. ‘వ్యవస్థలో మోసం చేసిన వ్యక్తి ఒక వైద్యుడు అయ్యాడనుకోండి. అ తను సమాజానికి మరింత హానికరంగా తయారవుతాడు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ‘పరీక్ష నిర్వహణ బాధ్యత ఉన్న ఒక ఏజెన్సీకి ప్రాతిని ధ్యం వహిస్తున్నప్పుడు మీరు గట్టిగా వ్యవహరించాలి. ఒక పొరపాటు ఉన్నట్లయితే, అవును ఇది పొరపాటే అని, ఫలానా చర్య తీసుకోబోతున్నామని చెప్పాలి. అది మీ వ్యవహరణపై విశ్వాసాన్ని పెంచుతుంది’ అని బెంచ్ ఎన్‌టిఎ న్యాయవాదితో చెప్పింది.

ప్రాధికార సంస్థ సకాలంలో చర్య తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం నొక్కిచెబుతూ, ఇతర పెండింగ్ పిటిషన్లతో పాటు ఈ పిటిషన్లు జూలై 8న విచారణకు రాగలవని సూచించింది. పరీక్షను తిరిగి కొత్తగా నిర్వహించవలసిందని ఆదేశించాలని కోరుతున్న పిటిషన్లు కూడా వాటిలో ఉన్నాయి. ఈ కొత్త పిటిషన్లపై తమ సమాధానాలను రెండు వారాలలోగా ఎన్‌టిఎ, కేంద్రం దాఖలు చేయాలని బెంచ్ కోరింది. కొందరు పిటిషనర్ల తరఫున హాజరవుతున్న న్యాయవాదుల్లో ఒకరు పరీక్షలో అడిగిన ఒక ప్రశ్నకు సంబంధించి ఒక అంశం లేవదీయగా ‘అవి (ఎన్‌టిఎ, కేంద్రం) దానికి సమాధానం ఇస్తాయి’ అని బెంచ్ తెలిపింది. ‘మీ వాదనల ధ్యేయాన్ని అర్థం చేసుకుందాం.

ఈ వ్యవహారాల్లో సాయంత్రం కూర్చొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని బెంచ్ తెలియజేసింది, నీట్ యుజి 2024పై ఫిర్యాదులతో దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారిస్తున్నప్పుడు ప్రశ్న పత్రం లీక్‌పై ఆరోపణలు, పరీక్షలో ఇతర అవకతవకలపై సిబిఐ దర్యాప్తు కోసం అభ్యర్థనపై కేంద్రం, నీట్ స్పందనలను సర్వోన్నత న్యాయస్థానం క్రితం వారం కోరింది. ఎంబిబిఎస్, అటువంటి ఇతర కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం పరీక్ష రాసినవారిలో 1563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తాము రద్దు చేసినట్లు కేంద్రం, ఎన్‌టిఎ ఈ నెల 13న సుప్రీం కోర్టుకు తెలియజేశాయి.

తిరిగి పరీక్షకు హాజరు కావడమో లేదా సమయం నష్టానికి కేటాయించిన పరిహారం మార్కులను వదులుకోవడమో వారు ఎంచుకోవలసి ఉంటుందని కేంద్రం తెలిపింది. 4750 కేంద్రాల్లో మే 5న ఈ పరీక్ష నిర్వహించారు. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాలను ఈ నెల 14న ప్రకటించాలని ముందు భావించారు. కానీ, సమాధాన పత్రాల మూల్యాంకనం ముందుగానే ముగిసిన కారణంగా ఫలితాలను ఈ నెల 4న వెలువరించారు. ప్రతిష్ఠాకరమైన ఈ పరీక్షలో బీహార్ వంటి రాష్ట్రాలలో ప్రశ్న పత్రాల లీక్‌ల గు రించి, ఇతర అవకతవకట గురించి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలు పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలకు, పలు హైకోర్టులు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ల దాఖలుకు దారి తీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News